బండి సంజయ్ ని ఎందుకు అరెస్ట్ చేశారు ?
తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల లో మొదటి పరీక్ష అయిన తెలుగు ఏప్రిల్ ౦౩వ తేదీన జరిగింది. అయితే ఆ రోజు ఉదయం 09 : 35 సమయానికి వాట్సాప్ లోకి తెలుగు ప్రశ్న పత్రం వచ్చి చేరింది. దీనికి కారణం ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు అని గుర్తించారు పోలీస్ లు. పరీక్ష మొదలయ్యాక పేపర్ ఫోటో తీసి స్టూడెంట్స్ గ్రూప్ లో పెట్టాడు ఆ ప్రభుత్వ టీచర్. దీని వెనుక ఏ కుట్ర ఉన్నట్టు పోలీస్ లు గుర్తించలేదు.
ఇదిలా ఉండగా , తెలంగాణ వ్యాప్తంగా ఈ లీకేజీ వ్యవహారం పై పెద్ద దుమారం చెలరేగింది. ప్రతిపక్షాలు చాలా పెద్ద రచ్చ చేశాయి . గ్రూప్ 1 స్థాయి నుంచి పదవ తరగతి దాకా అన్ని పేపర్లు లీక్ ఎలా అవుతాయి అని బీజేపీ కాంగ్రెస్ BSP నేతలు ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరుకుల్లో పెట్టారు. అసలే వరుస అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కాం తదితర అంశాలతో చెడ్డ పేరు తెచ్చుకున్న BRS పార్టీ పెద్దలకి ఇదో పుండు మీద కారం మాదిరిగా మారింది.
అయితే రెండో రోజు ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఒక అతను , పరీక్ష సమయం తరువాత పేపర్ లీక్ చేసి ఇతరులకి పంపాడు . దాదాపు రెండు గంటల తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కూడా పంపాడు.
ఇతన్ని తక్షణమే అరెస్ట్ చేసిన పోలీసు లు ఈ విషయాన్నీ పసి గట్టడం, దాన్ని అధికారం brs పార్టీ , అనుబంధ మీడియా , ఇక ఈ లీకేజీ అంత బండి సంజయ్ చేయించినట్టు అర్ధం వచ్చేలా కధనాలు అల్లారు.
బండి సంజయ్ కి ఆ లీకేజీ చేసిన వ్యక్తి కంకణం కట్టినట్టు, సెల్ఫీ దిగినట్టు ఉన్న ఫోటో లు రెండు రిలీజ్ చేశారు మీడియా కి.
ఆశ్చర్యకరంగా ఇవన్నీ కేవలం మధ్యాహ్నం వరకే జరిగిపోయాయి .
ఇక సాయంత్రం అనుకున్నట్టు గానే పోలీస్ లు బండి సంజయ్ ఇంటికి చేరుకున్నారు. ఎటువంటి అధికారక అరెస్ట్ వారెంట్ లేకుండా , ఏ నోటీసు లేకుండా, ఒక పార్లమెంట్ సభ్యుడిని, అందులోనూ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అర్ధ రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీస్ లు .
“కమీషనర్ తో ఫోన్ లో ఏ కేసు లో అరెస్ట్ చేస్తున్నారు , కారణం ఏంటి అని అడిగితే , తనకి ఏమి తెలీదని , పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి అని కమీషనర్ చెప్తున్నారు. ఈ లోపలే 40 మంది దాకా పోలీస్ లు చుట్టూ ముట్టి లాక్కెళ్లారు. తాను కింద పది పోయి రక్తం వస్తున్న అలాగే లాకెల్లో పోయారు ” అని వాపోయారు బండి సంజయ్ భార్య .
సోషల్ మీడియా మాత్రం brs పార్టీ సోషల్ మీడియా కార్యకర్త లు బండి సంజయ్ ని పోలీస్ లు టెన్త్ పేపర్ లీక్ కేసు లో అరెస్ట్ చేశారు అనే ప్రచారం చేస్తున్న , అటువంటి ఆధారాలు ఏవి పోలీస్ ల వద్ద లేవు అని సమాచారం.
బండి సంజయ్ గారి భార్య మాట్లాడుతూ , “ఏదో ప్రివెంటివ్ కస్టడీ అని చెప్పారు కానీ ఏ విషయం లో అని మాత్రం చెప్పలేదు ” అని వివరించారు.