రేషన్ బియ్యం లో కేంద్రం వాటా ఎంత ?అసలు నిజం చెప్పిన కేంద్ర మంత్రి నిర్మల .
బీజేపీ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తన తెలంగాణ పర్యటన ని సంచలనం గా మార్చుకున్నారు. ఒక రేషన్ షాప్ లో వెళ్లిన తాను , అక్కడ మోడీ ఫోటో ఎందుకు లేదు అని అడిగారు, దానికి స్థానిక బీజేపీ నాయకులూ ఎన్ని సార్లు పెట్టిన తెరాస వాళ్ళు ఫోటో ని చింపేస్తున్నారు అని చెప్పారు.
నిర్మల ఈ విషయాన్నిఅక్కడే ఉన్న కలెక్టర్ ని అడగగా అతను ఏమి సమాధానం చెప్పలేదు.
,
జనం అంత ఉండగా , మీడియా సమక్షం లో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చాలా ఘాటుగా కలెక్టర్ ని ప్రశ్నించారు . ” రేషన్ బియ్యం లో కేంద్ర మరియు రాష్ట్ర వాటా ఎంతో మీకు తెలుసా ?
రేషన్ బియ్యం మోడీ ప్రభుత్వం ఫ్రీ గా ఇస్తోంది మీకు తెలుసా ?
ఈ ప్రశ్నలకి కలెక్టర్ నీళ్లు నమిలారు .
35 రూపాయల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం 29 రూపాయల సబ్సిడీ ఇస్తే , తెలంగాణ ప్రభుత్వం కేవలం నాలుగు రూపాయలు మాత్రమే ఇస్తుంది అని తేటతెల్లం చేసింది.
ఇక పై మోడీ ఫోటో ని రేషన్ షాప్స్ నుంచి పీకేస్తే , కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పుకొచ్చింది
నిర్మల గారు చేసిన ఈ వ్యాఖ్యలకి తెలంగాణ రాష్ట్రం లో రాజకీయ వేడిని పెంచాయి.. మంత్రి హరీష్ రావు హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడటం తగదు అని ఖండించారు . కానీ ఈ విషయం తప్పు , రాష్ట్ర ప్రభుత్వమే రేషన్ బియ్యాన్ని ఫ్రీ గా ఇస్తోంది అన్న విషయం మాత్రం చెప్పలేక పోయారు.
ఈ అసలు విషయాన్ని గట్టిగ జనం ముందు చెప్పినందుకు తెరాస నాయకులు ఇవన్నీ చిల్లర పనులు అంటూ ప్రతిస్పందిస్తున్నారు.