ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు BRS లో – జూపల్లి కృష్ణ రావు
జూపల్లి కృష్ణ రావు ని బి ఆర్ ఎస్ పార్టీ సస్పెండ్ చెయ్యడం తో ఆయన మీడియా ముందుకు వచ్చారు. ప్రశ్నించడం మొదలు పెట్టడం తోనే తనను సస్పెండ్ చేశారు అని ఆయన విమర్శ చేశారు. తాను తెలంగాణ కోసం యెట్లా అప్పట్లో ఎం ఎల్ ఏ పదవి కి రాజీనామా చేసాను అని , 2011 నుంచి కెసిఆర్ పార్టీ లో ఉన్నానని , అప్పట్లో పదవి ని వదిలి ఉద్యమం లో చేరిన నాకు సరైన గౌరవం హోదా దక్క లేదు అని వాపోయారు.
తన ఇంట్లో రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉంటె తప్పా ?
పార్టీ పెద్దలు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎందుకు ఉంది అని అడిగారు అని. మా ఇంట్లో ఎవరి ఫోటో పెట్టుకోవాలో ఆ స్వేచ్ఛ కూడా మాకు లేదా . ఏ ఫోటో పెట్టుకోవాలి అనేది మీరు డిసైడ్ చేస్తారా .
ఎన్నో ప్రాజెక్ట్ ల లో జరిగిన అవకతవకలు ప్రశ్నించి నందుకే నన్ను సస్పెండ్ చేశారు. సందర్భం వచ్చిన రోజు అందరి గురించి చెప్తాను.