తెలంగాణ లో కాంగ్రెస్ వస్తే పెన్షన్ 4 వేలు – రాహుల్ గాంధీ .
తెలంగాణ లో అధికారం లో రావడానికి కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఉచిత తాయిలాలు ప్రకటించటం మొదలు పెట్టింది. ఖమ్మం సభ లో రాహుల్ గాంధీ పెన్షన్ తో ఫ్రీ స్కీం ప్రామిస్ లు మొదలెట్టారు తెలంగాణ లో. తెలంగాణ లో అధికారం లో వస్తే నెలకు పింఛను నాలుగు వేలు ఇస్తామని ప్రకటించేశారు . ఈ దెబ్బ తో ఇప్పుడు కెసిఆర్ తప్పకుండ అంత కంటే ఎక్కువే పింఛను ప్రకటిశాడు అనడం లో సందేహం లేదు.
అయితే ఇలా ప్రతి సారి పింఛను పెంచుకుంటే పోవడం ఏ కానీ కొత్త పెన్షన్ ల గురించి ఎవరు మాట్లాడటం లేదు. కొత్తగా పెన్షన్ కోసం దాదాపు పది లక్షల మంది ఎదురు చూస్తున్న అర్హులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.
ఇంకో విషయం ఏంటి అంటే , ఇంట్లో ఒక్కరికే పెన్షన్. ఈ ఒక్క పెన్షన్ తో భార్య భర్త తగువులు కామన్ అయిపోయాయి తెలంగాణ లో .
ఇది ఇలా ఉంచితే అసలు ఈ నాలుగు వేల పింఛను సాధ్యమేనా ?
దీని గురించి మాట్లాడాలి అంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వేరే రాష్ట్రాలలో ఎంత పెన్షన్ ఇస్తోంది అన్న విషయం గమనించాలి.
కాంగ్రెస్ ప్రస్తుతానికి రాజస్థాన్, ఛత్తీస్గఢ్ , కర్ణాటక లలో అధికారం లో ఉంది . కానీ ఈ రాష్ట్రాలలో దేనిలో కూడా ఇంత పెన్షన్ లేదు .
https://govtschemes.in/rajasthan-social-security-pension-scheme#gsc.tab=0
అధికారిక రాజస్థాన్ ప్రభుత్వ వెబ్సైటు లో చూడండి. అక్కడ పింఛను ఇచ్చేది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. అక్కడ వయో వృద్దులకు రాహుల్ గాంధీ గారు కనిపించడం లేదా అని ప్రతిపక్షాలు అడగటం మొదలెట్టేశాయి.
ఇదే విషయాన్ని అక్కడ బీజేపీ ప్రభుత్వం గంట లోనే రచ్చ చేసే ప్రయత్నం చేసింది. ఇక్కడ అధికారం లో ఉంది ఇచ్చేది వెయ్యి, అక్కడ తెలంగాణ లో అధికారం లో రావడం కోసం నాలుగు ఇంతలు ఎక్కువ ఇస్తామని చెప్పడం ఎంత వరకు న్యాయం.
ఆ వెయ్యి కూడా మొన్నే వెయ్యికి పెంచారు… మొన్నటి వరకు అక్కడ ఇచ్చింది 750 .