తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నేతల టెలిఫోన్ మాటలు లీక్ అయ్యాయా ?

0
Teenmaar mallana phone leak

తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ని జాకీ లు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు అనేది జగన్ ఎరిగిన సత్యం. చింతపండు నవీన్ కుమార్ Q న్యూస్ మీడియా ద్వారా కాంగ్రెస్ కి అనుకూలంగా ఇతర పార్టీ లకి వ్యతిరేకంగా నాటకం రచించడం ఈ పాటికే తెలంగాణ లో చదువుకున్న అర్బన్ యువత కి అర్ధం అవుతోంది. అయితే ఇప్పుడు ఈ విషయం అధికార BRS వ్యవస్థ ద్వారా కొన్ని టెలిఫోన్ సంభాషణ రికార్డింగ్ ల ద్వారా బట్టబయలు చెయ్యబోతోందా ?

ఇదే విషయం ఇప్పుడు రాష్ట్రం లో చర్చ గా మారుతోంది. అయితే ఈ తీన్మార్ మల్లన్న లోపాయికారి బుద్ధి ని అధికార పార్టీ ఎక్కడ బయట పెడుతుందో అని భయపడి తన యూట్యూబ్ ఛానల్, శనార్తి తెలంగాణ పత్రిక ద్వారా ఇప్పుడు ఆ లీక్ కాబోయే రికార్డింగ్ లు అన్ని అంత అబద్ధం అనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా ?

Q న్యూస్ లో అన్ని పార్టీ లని అరుసుకునే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ని , ఆ పార్టీ ఇతర రాష్ట్రాల్లో చేస్తున్న అవినీతి ఏ కోసం కూడా చర్చ కి రాయనివ్వదు. ఆ వార్తలు ఏదైనా పత్రిక లో వస్తే దాన్ని చదవకుండా స్కిప్ చేయిస్తాడు అన్న విమర్శ ఉంది.

కానీ ఇవన్నీ అమాయక గ్రామీణ యువత కి , బీసీ , ఎస్ సి , వర్గాల పేదలకు అర్ధం కాకపోవచ్చు. కానీ ఆ రికార్డింగ్ లు బయటకి పొక్కితే చింత పండు నవీన్ చింత పులుసు పిండే దాకా వదిలిపెట్టరు.

ఇప్పుడు ఇదే భయం తీన్మార్ మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ కుమార్ కి పెట్టుకున్నట్లుంది. అందుకే తమ మీడియా లో ముందే ఈ వీడియో లు లీక్ అవుతాయి అని సన్నాయి నొక్కులు నొక్కడం స్టార్ట్ చేసాడు.

ఈరోజు ఉదయం Q న్యూస్ యూట్యూబ్ ఛానల్ లో చర్చ అంత ఇదే…. ఆడియో టేప్ లు అన్ని ఫేక్ అని మిమిక్రీ ఆర్టిస్ట్ ల ద్వారా చేయించారు అని. 1000 కోట్లు తో ఈ ఫేక్ ఆడియో లు సృష్టించారని ముందే కన్విన్స్ చేసే ప్రయత్నం మొదలు పెట్టాడు.

అధికార brs పార్టీ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి , కంటోన్మెంట్ క్రిశాంక్, మన్నే తదితర ఇతర నాయకుల కి ఈ ఆడియో మార్ఫింగ్ పని అప్పచెప్పినట్టు ఒక కధానాన్ని వార్చి వన్డే ప్రయత్నం చేసాడు.

ఇక ఇప్పటి నుంచి వరుస పెట్టి తీన్మార్ మల్లన్న , రఘు ఇంకా ఇతర జర్నలిస్ట్ ల ఫోన్ ఆడియో లు , కాంగ్రెస్ నాయకుల తో సాగించిన బేరాలు లీక్ అవుతాయి అని చెప్పుకొచ్చారు.

అయితే శరత్ చంద్ర లాంప్ ఉద్దండ వకీల్ లని పెట్టుకుని యాభై పైగా కేసు ల నుంచి తప్పించుకుని బయట తిరుగుతున్న తీన్మార్ మల్లన్న కి ఆ ఆడియో టేప్ లు ఫేక్ అయితే తిరిగి అధికార పార్టీ మీద వెయ్యి కోట్ల defamation కేసు వేయ్యలేడా అన్న చిన్న లాజిక్ ప్రజలు గుర్తించలేరా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *