జాతీయ స్థాయిలో పాపులర్ అవుతున్న వైస్సార్సీపీ రౌడీయిజం, ఆంధ్ర లో పోలీస్ లు లేరా అంటూ ఇతర రాష్ట్రాల ప్రజల ప్రశ్నలు .
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పెరిగిపోతున్న రాజకీయ రౌడీయిజం ఇప్పుడు జాతీయ స్థాయి లో పాపులర్ అయిపోయింది . నరుకుతా , చంపుతా , రేప్ చేస్తా , అని బహిరంగంగా బెదిరింపులు , ఘటనలు ఇంతకు ముందు బీహార్, ఉత్తరప్రదేశ్ లో జరిగేవి. ఇప్పుడు ఆ సంస్కృతి ఆంధ్ర కి కూడా పాకిందా అంటూ ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంటర్నెట్ లో ప్రశ్నించే రోజులు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ ని బెదిరించిన బోరుగడ్డ అనిల్ కుమార్ వీడియో ఇప్పుడు నేషనల్ లెవెల్ లో సంచలనం అయ్యింది. బోరుగడ్డ అనిల్ , పవన్ కళ్యాణ్ ని అసభ్యంగా తిడుతూ , వైజాగ్ వస్తే చంపుతా అని, పవన్ కళ్యాణ్ భార్యని పిల్లల్ని నాకు అప్ప చెప్పెను అని ( చేతితో రేప్ అర్ధం వచ్చేలా సఙ్గ్య చెయ్యడం ) అసభ్య ప్రవర్తనని చూసి జాతీయ స్థాయి సోషల్ కార్యకర్త ” అన్షుల్ సక్సనా ” NCW కి ట్వీట్ చేసాడు .
నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ దృష్టి కి ఈ విషయాన్నీ తీసుకెళ్లాడు .
దీన్ని చూసిన తెలుగు ప్రజలు, ఓసి ఇంతేనా, ఇవన్నీ మా ఆంధ్ర రాష్ట్రంలో కామన్ అంటూ రోడ్ పై తెలుగు దేశం మాజీ మంత్రి ఆడి కార్ ని వైస్సార్సీపీ కి నాయకుడు పగులగొట్టే వీడియో పెట్టి చూపించాడు.
ఆడి కార్ ని ధ్వంసం చేసిన వాడే అరెస్ట్ కాలేదు ఇంకా వీడియో లో బెదిరించిన వాడు అరెస్ట్ అవుతాడా అంటూ వెటకారాన్ని ప్రదర్శించారు .