అతి కష్టం మీద వంద కోట్లు గ్రాస్ దాటిన చిరంజీవి GOD FATHER, పడిపోతున్న చిరంజీవి ఇమేజ్ కి నిదర్శనం ?

0
గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

చిరంజీవి సినిమా అంటే మొదటి మూడు రోజులు టికెట్ దొరకటమే కష్టం అన్నంత రేంజ్ లో మెగా స్టార్ ఇమేజ్ ఉండేది అప్పట్లో. 90 వ దశకం లో వచ్చిన సినిమాలు హిట్లర్, మాస్టర్, ఇంద్ర లాంటి బ్లాక్బస్టర్ సినిమా లకి టికెట్ లైన్స్ లో తొక్కిసలాటలో మనుషులు చనిపోయారు అంటే ఇప్పటి తరం ఎవరు నమ్మరు. కానీ అప్పట్లో చిరంజీవి సినిమా అంటే అలా ఉండేది క్రేజ్.
ఇక హిట్లర్ సినిమా ఎంత హిట్ అంటే , జీడిమెట్ల ప్రాంతం లో కొత్త కట్టిన సినిమా థియేటర్ ” రంగ 70 A / C ” యొక్క ఎనిమిద అడుగుల ప్రహరీ గోడ టికెట్స్ కోసం లైన్అ లో నించున్న వందల మంది అభిమానుల ధాటికి ఒక్కసారిగా కూలిపోయింది . కొత్త థియేటర్ యాజమాన్యం అప్పటికప్పుడు కొత్త గోడ నిర్మించుకుంది.ఇలా ఉండేది అప్పట్లో మెగా స్టార్ క్రేజ్ .

కానీ ఇప్పుడు చిరంజీవి సినిమా కి వెళ్లే జనం బాగా తగ్గిపోయారు అనేదానికి ఆయన గత మూడు సినిమాల కలెక్షన్స్ చూస్తే తెలుస్తోంది.
ఒక్క సినిమా అంటే ప్లాప్ అయిందేమో అనుకోవచ్చు , కానీ మలి దశ లో ఒక్క ఖైదీ సినిమా తప్ప ఏ చిరంజీవి సినిమా కి కూడా క్రేజ్ రాలేదు.
సైరా నరసింహ రెడ్డి సినిమా ని ఏదో దేశ భక్తి సినిమా లా రాణించేసారు . అది కూడా పెద్దగా లాభాల్లో కి రాలేదు … కానీ తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కి కూడా అసలు ఓపెనింగ్స్ రాలేదు . సినిమా అయితే రెండు షో ల తర్వాత సగం జనం కూడా రాలేదు ఏ థియేటర్ లో . ఇక ఎన్నో అంచానాలు అంటూ ఊదరగొట్టిన గాడ్ ఫాదర్ సినిమా కి అయితే ఎంత పండుగ టైం లో రిలీజ్ చేసిన పబ్లిక్ ఇంటరెస్ట్ చూపించలేదు .
వరసగా దసరా సెలవలు , పైగా పెద్ద సినిమా లు లేవు , థియేటర్ లు కాళీ , అయినా కూడా బుక్ మై షో లో ఆఖరి నిమిషం లో కూడా టికెట్స్ ఖాళి గ ఉండటం , చాలా థియేటర్స్ లో శనివారం కూడా సగం టికెట్ లు తెగక పోవటం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది .

రజినీకాంత్ , మోహన్ లాల్ లా యూత్ ఫాలోయింగ్ లో చిరు ఫెయిల్ అయ్యాడా ?

రజిని కాంత్ కి తమిళనాడు యువకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది, వయసు తేడా లేకుండా రజిని సినిమా కి అక్కడ టికెట్స్ తెగుతున్నై , అలాగే మోహన్ లాల్ ఇంకా మలయాళం లో టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు . కానీ తెలుగు సినిమా కి వచ్చేసరికి సీనియర్ హీరోస్ కి అంత సీన్ లేదు అనే చెప్పాలి .

మహేష్ , పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ , ప్రభాస్ సినిమాలకి ఓపెనింగ్స్ బలంగా ఉండటానికి కారణం యూత్. కాలేజీ స్టూడెంట్స్ మరియు పాతిక వయసు వున్న యువత ఫస్ట్ డే సినిమా కి ఎక్కువగా వెళతారు . ఆ తర్వాత రెండో రోజు నుంచి ఫామిలీ ఆడియన్స్ వెళ్తారు.
కానీ చిరంజీవి సినిమా కి యూత్ అసలు వెళ్ళటం లేదు, రెండు రోజు ఫామిలీ ఆడియన్స్ వెళ్లేసరికి నెగటివ్ టాక్ వచ్చేస్తోంది.

ప్లాప్ టాక్ తో లాస్ట్ రన్ లో 100 కోట్లు గ్రాస్ తెచ్చుకునే సత్తా వున్నా హీరోలు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ మాత్రమే , భీమ్లా నాయక్ , సర్కారు వారి పాట సినిమాలు below average టాక్ తో కూడా దాదాపు 120 , 145 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్నాయి. కానీ హిట్ టాక్ వచ్చిన గాడ్ ఫాదర్ మాత్రం ఏ పోటీ లేకున్నా కూడా వంద కోట్ల గ్రాస్ రాడానికి రెండు వారాలు పట్టింది.

ఈరోజు తో మూడో వారాంతం థియేటర్ లో ఉన్నట్టు అవుతుంది గాడ్ ఫాదర్ కి. అయినా కూడా సినిమా షేర్ 90 కోట్లు బ్రేక్ ఈవెన్ సాధించటం కష్టం.

చిరంజీవి ఇమేజ్ ఎందుకు పడిపోయింది? టాప్ హీరో కలెక్షన్స్ స్థాయి లో ఎందుకు లేవు ?

కింది ఫోటో చూడండి. మోహన్ లాల్ లూసిఫెర్ సినిమా లోని ఒరిజినల్ సీన్ అది. ఆ సీన్ థియేటర్ లో చూసినప్పుడు ఒక రకమైన మాస్ రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి.
చిరంజీవి ,మోహన్ లాల్ ల వయసు దాదాపు ఒకటే. కానీ రెండు సీన్స్ లో తేడా చూడండి. సౌకర్యం కోసం చిరంజీవి గోడీఫాథర్ లో పోలీస్ ఆఫీసర్ ని సోఫా వేసి కూర్చోపెట్టారు. అదే ఒరిజినల్ లో మోహన్ లాల్ కాలుని ఐదు అడుగులు ఎత్తి పోలీస్ ఆఫీసర్ ని గుండెల పై పెడతాడు .
రెండు సీన్స్ లో ఇంపాక్ట్ చాలా తేడా ఉంది . ఇలాంటి తేడా లు చూసినప్పుడే యూత్ లో ఒక రకమైన అయిష్టత ఏర్పడుతుంది.
మోహన్ లాల్ పేస్ లో కంప్లీట్ డామినేషన్ వుంది, కానీ చిరంజీవి కష్టం గా డామినెటే చేస్తున్నట్టు ఉంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *