దేవతలు తాగే అమృతం ఇదే .. నీరని అమృతం తో పోల్చిన శ్రీనివాస్ గౌడ్

0
Srinivas goud neera opening

Table of Contents

నిర కేఫ్ ని ప్రారంభించే ఈవెంట్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నీరా ని పొగిడే సమయం లో దాన్ని అమృతం తో పోల్చారు . పురాణాలలో దేవతలు కూడా ఇదే తాగారు అని వుంది , కేవలం గౌడ కులాన్ని తొక్కేయాలి అన్న ఉద్దేశం తో కొన్ని పెద్ద కులాలు దీని ఆల్కహాల్ ప్రోడక్ట్ గా పరిగణించి దీని విలువ ని తగ్గించారనిపురాణాలలో అమృతం అంటే ఇదే అని ఏదేదో ఆవేశం లో వాగేశారు మన మంత్రి గారు. ఎప్పుడు చూడని కొందరిని తీసుకొచ్చి వీళ్ళు స్వామిజి లు పీఠాధిపతులు అంటూ వాళ్ళతో తాటి చెట్టు నీరు తాగించి హడావిడి చేశారు .

ఈత , తాటి చెట్టు నుంచి వచ్చే పదార్ధం తామిసికం కాబట్టి , దానికి అన్ని వర్గాలలో ఆదరణ లేదు, ఆ పదార్ధం సవిస్తే కాస్త మత్తుగా ఉండటం కూడా దానికి సంకేతం కావొచ్చు.
అదే కొబ్బరి చెట్టు పదార్థానికి అలాంటి తామసిక గుణం లేదు, అది సాత్వికం అందుకే దానికి ఏ నిషేధం లేదు. మరి కొబ్బరి చెట్టు ఎవరైనా పెంచుకోవచ్చు , సేవించవొచ్చు.

అదే తాటి లేదా ఈత చెట్లు మాత్రం కేవలం గౌడ కులస్థుల కుల వృత్తి మాత్రమే ఎందుకు ? అలా అయితే గౌడ కులస్తులే ఇతరులని తొక్కేసినట్టు కాదా మంత్రి గారు ?

తాటి కల్లు తాగితే కిడ్నీ లో రాళ్లు కరగడం లాంటివి జరుగుతాయి. కానీ ఇదే గుణం కాస్త తక్కువో ఎక్కువో కొబ్బరి నీళ్లలో కూడా వుంది. కొబ్బరి నీళ్లలో ఇంకా చాలా ఆరోగ్య గుణాలు వున్నాయి. చెట్టు కళ్ళు అనేది ఎండ వేడి ఎక్కువ గ వుండే తెలంగాణ లాంటి ప్రాంతం లో మానవ జాతి మేలు చేస్తుంది వేసవి లో , దానికి సుగుణాలు ఎవరు కూడా కాదనలేరు.
కానీ కొన్ని వర్గాల వాళ్ళు తామసిక పదార్థాలు తినరు . ఆ తామసిక లిస్ట్ లో తాటి చెట్టు, ఈత చెట్టు పదార్ధాలు మాత్రమే లేవు , పుట్టగొడుగులు, గేగులు లాంటి తినే పదార్ధాలు కూడా వున్నాయి. మాంసం కూడా ఆ కోవలోనిదే. అందుకే సాత్విక జీవనం పాటించేవాళ్ళు తామసిక ఆహార పదార్థాలు తినరు.

ఈ పాటి జ్ఞానం లేని మన మంత్రి వారు ఆవేశం లో ఏదో ఇష్టం వచ్చినట్టు వాగేశారు.

ఇలా ప్రతి దానికి కొన్ని పెద్ద కులాల పై విషం కక్కడం శ్రీనివాస్ గౌడ్ గారికి కొత్త కాదు . ఇంతకుముందు మహబూబ్నగర్ లో ఆయన పై వచ్చిన అవినీతి మరకలు కూడా పెద్ద కుల మనుషుల ఈర్ష ఓర్వలేని తనం కారణం అన్నట్టు చెప్పుకొచ్చారు.

అలా అని శ్రీనివాస్ గౌడ్ గారు ఏ బహుజన పార్టీ లోనో లేరు, అదే పెద్ద కులాలలో ఒకటి ఐన వెలమ కులం అధికారానా వున్నా BRS పార్టీ లో వున్నారు అనే సంగతి మరిచారు.

మఠాధిపతుల తో నీరు తాగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఎక్కడి నుంచో నలుగురు స్వామిజి లని పట్టుకొచ్చి నీరు తాగించి సీన్ చేశారు మంత్రి గారు. బసవ మూర్తి అని, నిశ్చలానంద అని , ఏవో పేర్లు పిలిచారు స్టేజి మీద పిలిచి కర్ణాటక నుంచి వచ్చారు అని చెప్పి వాళ్ళ చేత తాగించారు .

స్వామిజి , మాఠాధిపతులు అని సంబోధించారు మంత్రి గారు. కర్ణాటక నుంచి అన్నారు. కన్నడ నాట వీరశైవ మఠాలు ఉంటాయి, లేదా దక్షిణాన శంకరాచార్య పీఠం లేదా బ్రాహ్మణా పీఠాలు ఉంటాయి. మొహాన సరిగ్గా బొట్టు కూడా లేని ఇద్దరు కాషాయం కట్టిన వాళ్ళ తో నీరు తాగించి హడావిడి చేశారు మంత్రి గారు.

వీరశైవులు , బ్రాహ్మణులూ తాటి చెట్టు జోలికి వెళ్లరు. హైందవ సన్యాసి ఎవ్వరు తాటి, ఈత చెట్టు పదార్ధాలు సేవించరు .

దేవతలు తాగిన అమృతం ఇదే – శ్రీనివాస్ గౌడ్ .

అమృతం అనేది పాల సముద్రం మంథనం చేసినప్పుడు వచ్చిన ఒక దివ్య అమృతం. అంత కన్నా ముంది కాలకూట విషం , లక్ష్మీదేవి ఐరావతం వచ్చాయి. పాల సముద్రం అంటే కాస్మిక్ ఓషన్ . అసలు దానికి ఈ తాటి చెట్టుకి సంబంధం ఉందా .
ఇది దేవతలని అవమానించం కాదా ?

అంటే శ్రీనివాస్ గౌడ్, ఒక తాటి చెట్టు కోసం దేవతలు, రాక్షసులు కొట్టుకున్నారు ?

తెలంగాణ లో పీఠాధిపతులు, స్వామిజి లు నీరు తాగడానికి ఒప్పుకోలేదా ?

తెలంగాణ లో ఎన్నో వీరశైవ మఠాలు వున్నాయి, హైదరాబాద్ శివారు ప్రాంతాలు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎంతో మంది మఠాధిపతులు వున్నారు. అలాగే హైదరాబాద్ లోనే చినజీయర్ లాంటి వైష్ణవ గురువులు ఉండనే ఉన్నారు . వారందరిని కాదని ఎక్కడో కర్ణాటక నుంచి మొహాన సరిగ్గా బొట్టు కూడా లేని నలుగురు మనుషులని పట్టుకొచ్చి ఇదిగో వీళ్ళు పీఠాధిపతులు వీళ్ళు తాగుతున్నారు , ఇంకా అందరూ రోజు సిగ్గు లేకుండా తాగొచ్చు అంటే ఎలా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *