కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదిని ప్రకటించిన ఎన్నికల కమిషన్
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నకల తేదిని ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రకటించింది . దక్షిణాదిన రాజకీయ ద్వారంగా పరిగణించ పడుతున్న కర్ణాటక రాష్ట్రం లో రెండు జాతీయ పెద్ద పార్టీలు ప్రత్యర్ధులు గ ఉన్నాయ్ , అందుకని ఈ ఎన్నికలు త్వరలో జరగనున్న జాతీయ పార్లమెంట్ ఎన్నికల పై ప్రభావం చూపే వి గా రాజకీయ పండితులు భావిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల వేడి మతం కులం చుట్టూనే ఎక్కువగా సాగుతాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ మే 10 రోజు జరగనున్నాయి . ఫలితాలు మే 13 న ప్రకటించ నున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ ఈ రోజు ఎన్నికల ప్రచారం లో డబ్బులు పంచుతూ వీడియో కి చిక్కడం అప్పుడే ఎన్నికల వేడిని సూచిస్తోంది.
బీజేపీ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ ను తొలగించడం. తొలగించిన ఆ 4 % రిజర్వేషన్ ను లింగాయతలకి , వొక్కలిగ లకి రెందు శాతం చొప్పున ఇచ్చేసింది.
ఈ దెబ్బ తో వొక్కలిగలకి 4% నుంచి 6 % పెంచడం తో జెడి ఎస్ పార్టీ వోట్ బ్యాంకు గా వున్నా వొక్కలిగ లని ఆకర్షించడం లో బీజేపీ విజయం సాధిస్తుందా అనేది వచ్చే ఎన్నికలలో తెలవనున్నాయి. ఇదే జరిగితే కుమారస్వామి పార్టీ కి ఇది పెద్ద సమస్యే.