సభ్యత సంస్కారం లేకుండా యోగి ఆదిత్యనాథ్ పై నోరు పారేసుకున్న సుజాత గౌడ్

0
TRS leaders abuses

తెరాస మహిళా నేత ఒకరు సభ్యత సంస్కారం లేకుండా , తాను ఒక మహిళా అన్న సంగతి కూడా మర్చి పోయి , ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి పై నోరు పారేసుకుంది . ధమ్మాయిగూడ మహిళా తెరాస నేత గా , సోషల్ మీడియా ఇంచార్జి గా చెప్పుకునే సుజాత గౌడ్ అనే గులాబీ నాయకురాలు యోగి ఆదిత్యనాథ్ ని ” అరేయ్ గుండు సన్నాసి ” … పోరా అంటూ తన సంస్కారాన్ని చాటుకుంది .

తెరాస పెద్దలని చూసి నేర్చుకుందేమో , లీడర్స్ ని తిట్టడం ఫాషన్ అని అనుకుందేమో కానీ స్థాయి , విలువలని పక్కకి పెట్టి( అసలు తెలుసో లేదో ) తిట్టేసింది .

యోగి ఆదిత్యనాథ్ అంటే ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాదు ,, ఎలా పడితే అలా తిట్టడానికి .
అతనొక సన్యాసి .
అందులో గోరకనాథ్ మఠానికి అధిపతి .
ఈనాడు ముఖ్యమంత్రి కావొచ్చు కానీ ఆయనొక సన్యాసి.
సన్యాసిని పట్టుకుని సన్నాసి , ఒరేయ్ తురేయ్ అనింది అంటే , ఈవిడ గారి కుటుంబం మర్యాదలు సంస్కృతి సంప్రదాయాలు ఎలాంటివో అర్ధం అవుతోంది .

సన్యాసి , మఠాధిపతి పక్కన పెట్టండి ..
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా తెలీకుండా రాజకీయ నాయకుల అయిపోతున్నారు .
అందులో ఒక మహిళా అయి ఉండి, సభ్యత లేకుండా ఒరేయ్ తురేయ్ అని వాగేయ్యడం అంటే మామూలు బరితెగింపు కాదు .

రాజకీయా ప్రశ్నలు హుందా గా ఉండాలి , లేదా వెటకారం తో కూడా ఉండవచ్చు. వ్యంగ్యాస్త్రాలు వదలాలంటే భాష జ్ఞానం ఉండాలి , ఇలాంటి సభ్యత లేని వాళ్లకి అంత భాష జ్ఞానం ( జానపదం అయినా – లోకల్ తెలంగాణ వ్యంగ్యం అయినా ) ఉందనుకోడం మన భ్రమ . అవిలేకనో , విషయం పరిజ్ఞానం లేకనో, జనాలలో త్వరగా పాపులర్ అవ్వడానికి ఈ మధ్య పెద్ద లీడర్ లని నోటికి వచ్చినట్టు తిట్టడం గొప్ప తనం అనుకుంటున్నారు .

ఈవిడ గారు ఎక్కడో ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి తిట్టడం వల్ల ఆయన కు జరిగే నష్టం ఏమి ఉండదు. కాకపోగా ఈవిడ ఇక్కడ సభ్యత లేని మనిషి గా ముద్ర వేయించుకుంటుంది .

ఒకప్పుడు ఎంతో పేరు మోసిన , బలమైన రాజకీయ నాయకులు రాజకీయ శత్రువులు గా ఉండేవారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి , చంద్ర బాబు నాయుడు , ఎన్టీఆర్ , చెన్నా రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇలా చాలా ప్రజా మరియు ధన బలం గల నాయకులు కూడా ఎన్నడూ నోటి దురుసు చూపలేదు పబ్లిక్ గా…
ఇప్పుడు రాజకీయా నాయకులు ప్రత్యర్థుల్ని ఒరేయ్ అనుకోడం సాధారణం అయిపోయింది .
అయినా కూడా ఇలా మత పెద్దలని , ఒక పరంపర లో సన్యాసులని ఇష్టం వచ్చినట్టు తిడితే ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర లోనే వున్నాయి . అప్పుడు ఏ పెద్ద నాయకుడు ఇలాంటి జ్ఞానం లేని , పరిపక్వత లేని చోట గల్లీ నాయకులని కాపాడలేడు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *