గౌడ, పద్మశాలి కులాల ఓట్ల కోసం తెరాస తిప్పలు ! రెండు కులాల కోసం వారం రోజులు కేటాయించిన KTR

0

చేనేత వస్త్రాలు , కళ్ళు గీత సమస్యల పై వారం రోజులుగా హడావుడి కనిపిస్తోంది. అధికార పార్టీ వరుస ప్రెస్ మీట్ లు, ముప్పై కి పైగా ట్వీట్ లు , పోస్ట్ కార్డు లెటర్ ఉద్యమాలు , అబ్బో అబ్బో ఒక్క సారిగా ఇది ఇప్పుడు దాదాపు నేషనల్ న్యూస్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు చేనేత కార్మికులు , గౌడ్ కులస్థులు తెరాస కి ఎందుకు గుర్తుకు వచ్చారు. KTR అయితే ఏకంగా ప్రెస్ మీట్ లు , పదికి పైగా ట్విట్టర్ లో ట్వీట్ ల తో ఈ సమస్య పై తానేదో ఉద్యమమే చేస్తున్నట్టు వ్యవహరిస్తున్నాడు.

ఒక్కసారిగా చేనేత కార్మికులు ( పద్మ శాలీయుల ) , గౌడ ల పై ఇంత ప్రేమ ఎందుకు ?

చేనేత వస్త్రాల ముడిసరుకు పై 5 % GST ఇప్పుడు కొత్తగా పెట్టలేదు, 2017 నుంచి వుంది. కానీ ఇప్పుడు సడన్ గా గులాబీ పార్టీ కి ఎందుకు ఈ సమస్య పై గళమెత్తాలని అనిపించింది అంటే, చేనేత కార్మికుల అంటే పద్మశాలి కులస్థులు ( అంటే సాలోళ్లు ).పద్మశాలి కులస్థులు , గౌడ కులస్థులని ఇప్పుడు బుజ్జగించుకునే అవసరం ప్రతి పార్టీ కి ఉంది రాష్ట్రం లో . ఎందుకంటే, మునుగోడు ఉప ఎన్నికలలో దాదాపు పది శాతం ఓటర్లు పద్మా శాలీయులే . ఇంకా గౌడ కులస్థులు అయితే ఏకంగా 21% పైనే ఉన్నారు.
అందుకే అధికార తెరాస పార్టీ వారం రోజులుగా పద్మ శాలి , గౌడ కులస్థులని దువ్వే కార్యక్రమం లో బిజీ గా ఉంది. వరుస పెట్టి కుల పెదాలతో మీటింగ్ లు , పార్టీ లు అబ్బో అబ్బో … గౌడ లు అయితే తెరాస లీడర్ ల బుజ్జగింపు తో ఉబ్బి తబ్బిబు అవుతున్నారు .

పైనే గ్రాఫ్ లో క్లియర్ గా కనిపిస్తున్న విషయం ఏంటి అంటే, కేవలం గౌడ, పద్మశాలి వోట్ లు సరిగ్గా పడితే పార్టీ గెలిచిపోతుంది. కానీ ఇక్కడ బీసీ కులస్థులు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వెంట వున్నసంగతి తెరాస కి తెలుసు. రాజగోపాల్ రెడ్డి సొంత ఖర్చులతో చాలా పనులు చేయించినట్టు ఎన్నో మీడియా ఇంటర్వ్యూ ల్లో జనాలే చెప్తున్నారు.
ఇలాంటి సందర్భం లో బీసీ వోట్ లు రాబట్టాలి అంటే పెద్ద ఉద్యమమే చెయ్యాలి , గదిబిడి చెయ్యాలి , గలాటా చెయ్యాలి , మైండ్ కాంఫుసే చెయ్యాలి , ఇప్పుడు తెరాస చేస్తోంది అదే.

ఎప్పుడూ లేంది తెరాస కి సడన్ గా గౌడ లు , పద్మశాలి లు గుర్తుకు వచ్చారు . ఎంత అంటే. ట్విట్టర్ మొత్తం తెరాస పార్టీ నాయకుల ట్వీట్ లు అన్ని పద్మ శాలి సమస్య ల గురించే .

ఎప్పుడూ లేనిదీ KTR వరుసగా పది ట్వీట్ లు చేనేత కార్మికుల గురించి పెట్టడం, పోస్ట్ కార్డు ఉద్యమం అంటూ హడావిడి చెయ్యడం , చేంజ్.ఆర్గ్ వెబ్సైటు లో పోల్ రిక్వెస్ట్ పెట్టడం , అబ్బో చాలా తతంగం నడుస్తోంది .
పోనిలే ఇలా అన్న చేనేత కార్మికుల సమస్యలు తీరితే బాగుంటది , అని కొందరు పబ్లిక్ సంతోష పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *