రిషి సునాక్ బయోగ్రఫీ , చదువు, పేరెంట్స్,వైఫ్, దేశం, హిందూ మతం తదితర విషయాలు
రిషి సునాక్ భారతీయ హిందూ నేపధ్యం గల బ్రిటిష్ పౌరుడు. రిషి తాతగారు అప్పటి బ్రిటిష్ భారత దేశం లోని గుజ్రాన్వాలా (ఇప్పటి పాకిస్తాన్ ) నుంచి కెన్యా కి వలస వెళ్లారు. కెన్యా నుంచి వీరి కుటుంబం ఇంగ్లాండ్ వెళ్లడంతో అక్కడ ఋషి సునాక్ 1980 మే 12 వ రోజున సౌత్ hampton పట్టణం లో జన్మించాడు. రిషి ఇంగ్లాండ్ యొక్క తొలి విదేశీ మూలాలు ఉన్న ప్రధానమంత్రి గా చెరిత్ర సృష్టించాడు. రిషి ఇంగ్లాండ్ కి తొలి హిందూ ప్రధాన మంత్రి .
Name | Rishi Sunak |
Date of Birth | 12 May1980 |
Age | 42 ( ప్రధాని అయ్యేనాటికి) |
చదువు | స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ( MBA ) |
Wife | Akshata Murthy |
Father | Yashvir |
Mother | Usha Sunak |
పూర్వీకుల నేపధ్యం | Gurjanwala ( Pakistan ) |
Religion | Hinduism. |
రిషి సునాక్ భార్య ఇన్ఫోసిస్ కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు.
రిషి సునాక్ వివాహం చేసుకున్నది భారతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తి ని .
రిషి సునాక్ రాజకీయ ప్రస్థానం
రిషి సునాక్ 2015 లో హౌస్ అఫ్ కామన్స్ కి రిచ్మండ్ నుంచి ఎంపీ గా ఎన్నికయ్యాడు . అప్పటి నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానం పది ఏళ్ళ లోపే ప్రధాని స్థాయికి వెళ్ళింది . బ్రేక్సిట్ విషయం లో ( బ్రిటన్ దేశం యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావడం ) రిషి సునాక్ కచ్చితంగా వ్యవహరించి మూడు సార్లు బ్రేక్సిట్ కి అనుకూలంగా వోట్ వేసాడు.
బ్రిటన్ ట్రెషరీ కి సెక్రటరీ గా బోరిస్ జాన్సన్ హయాం లో పని చెయ్యడం , ఆపై ఛాన్సలర్ అఫ్ exchequer గా నియమం కావడం తో ఆర్ధిక సంబంధ విషయాల పై పూర్తిగా అవగాహన వున్నా నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
అంతకు ముందు స్టాండ్ఫోర్డ్ నుంచి పట్టా పొందిన తర్వాత గోల్డ్ మ్యాన్ సాక్స్ కంపెనీ లో ఆర్ధిక అనలిస్ట్ గా పని చెయ్యడం విశేషం. ఆ అనుభవం తరువాత రాజకీయాలలో చేరిన తర్వాత బ్రిటన్ దేశ ఆర్ధిక వ్యవహారాలు చూడటానికి పనికి వచ్చింది అనే చెప్పాలి.
రిషి సునాక్ బయోగ్రఫీ లో అతి ముఖ్యమైన విషయం , ప్రధాన మంత్రి రేస్ లో మేరీ ఎలిజబెత్ ట్రేస్ అనే బ్రిటన్ వనిత చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోవడం . భారతీయ మూలాలు ఉంది ఒక హిందూ పేరు తో తెల్లవాడు కానీ ఒక వ్యక్తి ప్రధాన మంత్రి రేస్ లో సెకండ్ స్థానం లో నిలవడం అందరిని ఆశ్చర్య పరిచింది . కానీ స్థానికత సమస్యతో ట్రేస్ చేతిలో ఓడిపోయాడు . sep 06 2022 న ఎలిజబెత్ ట్రేస్ అత్యంత కష్ట పరిస్థితిలో ప్రధాన మంత్రి గా బాధ్యతలు తీసుకున్నారు .
కానీ బ్రిటన్ దేశం ఆర్ధిక పరిస్థిథి బాగాలేక పోవడం తో కేవలం 45 రోజులలోనే రాజీనామా చెయ్యడం తో రిషి సునాక్ కి ఆ అవకాశం వచ్చింది.