తొలివెలుగు నుంచి జర్నలిస్ట్ రఘు అవుట్
తొలివెలుగు రఘు అంటే తెలంగాణ లో పాపులర్ జర్నలిస్ట్. ఆన్లైన్ న్యూస్ ఛానల్ కి వన్ మిలియన్ subscriber లను సొంతం చేసుకున్న ఘనత ఈ జర్నలిస్ట్ కె సాధ్యమయింది. అలాంటి తొలివెలుగు రఘు , ఈ రోజు తొలివెలుగు నుంచి వెళ్ళగొట్టాడు TV9 రవిప్రకాష్. ఎందుకు తొలివెలుగు నుంచి రఘు బయటకి పంపేశారు అనేది రఘు తీన్మార్ మల్లన్న Q న్యూస్ లైవ్ లో చెప్పాడు. తొలివెలుగు లో కవిత కి , కెసిఆర్ కి అనుకూల వార్తలు ప్రసారం చెయ్యడం పై తన పై ఒత్తిడి పెంచడం తో తాను ఆ పని చెయ్యలేను అని ప్రకాష్ తో చెప్పడం తో తనను బయటకి పంపేశారు అనే నిజాన్ని లైవ్ లో చెప్పేసాడు .
తొలివెలుగు ప్రస్థానం
tv9 , mojotv ల యాజమాన్యం లోకి మై హోమ్ రామేశ్వర్ రావు ఎంటర్ అయ్యాక మోజో బంద్ అయ్యింది. Tv9 పూర్తిగా మారిపోయింది. Tv9 రవిప్రకాష్ పోస్టింగ్ ఊడింది. ఆ టైం లో పుట్టిందే తొలివెలుగు. రవిప్రకాష్ తెరవెనుక ఆర్ధికంగా ఉంటే, తెర ముందు కష్టపడి కూలీగా పనిచేసింది జర్నలిస్ట్ రఘు . హైదరాబాద్ 2020 వరదల సమయం లో ప్రతి గల్లీ కి వెళ్లి వరద సమస్య ని ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకి కళ్ళకి కట్టినట్టు చూపించిన జర్నలిస్ట్ తోలి వెలుగు.
సింగరేణి కాలనీ రేప్ కేసు
హైదరాబాద్ singareni కాలనీ చిన్నారి రేప్ మరియి మర్డర్ కేసు ని హైలైట్ చేసి మూడు రోజుల పాటు ఇతర మెయిన్ స్ట్రీమ్ న్యూస్ చానెల్స్ కవర్ చేసేలా చేసిన ఘనత తొలివెలుగు రఘు దే . నాలుగు రోజుల వరకు ఏ పెద్ద న్యూస్ ఛానల్ ఆ కాలనీ లో అడుగు పెట్టలేదు అనేది అందరికి తెలిసిన నిజం. ఆ కాలనీ వాసులు నాలుగో రోజు వెళ్లిన మెయిన్ స్ట్రీమ్ మీడియా లని కడిగి పడెయ్యడం అందరం చూసాం.
Pheonix స్కామ్స్, వట్టినాగులపల్లి సత్యం స్కాం భూముల కబ్జా , మై హోమ్ రామేశ్వర్ రావు సంస్థ కబ్జా వ్యవహారం లాంటి ఎన్నో అవినీతి అక్రమాలని కవర్ చేసిన ఏకైక తెలుగు జర్నలిస్ట్ రఘు.
వాడుకుని వదిలేసిన Tv9 రవిప్రకాష్ ?
తోలివేలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు తెలుగు వార్తలకి ఆన్లైన్ లో టాప్ 2 లో ఉంది . రోజు లక్షల మంది ఆన్లైన్ లైవ్ న్యూస్ చూస్తారు అంటే అది చిన్న విషయం కాదు. ఇంతలా వీక్షకులు వున్నారు అంటే అదంతా తొలివెలుగు రఘు ఘనతే.. ఇప్పుడు ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆ మెయిన్ సైనికుడిని బయటకు పంపేసిన రవిప్రకాష్ తన దుర్బుద్ధి ని బయట పెట్టుకున్నాడు.
ఒక్క పేపర్ మీద కూడా నీ సంతకం లేదు – రవి ప్రకాష్
Q మీడియా లైవ్ లో మల్లన్న ఫోన్ కాల్ రఘు భావోద్వేగం తో చెప్పిన మాటలు ఇవి.. రవి ప్రకాష్, మై హోమ్ రామేశ్వర్ రావు తో చేతులు కలిపి, కెసిఆర్ చెంచా గా మారిన తర్వాత ఇన్నిరోజులు కాస్త పడి నిర్మించిన తొలివెలుగు ని తనకే ఇస్తాడేమో అనే ఆశ వెళ్లి కలిస్తే. ” మీడియా అంటే జనం కాదు , డబ్బు ” అని ప్రకాష్ అన్నట్టు , నీ సంతకం తొలివెలుగు ఆఫీస్ లో ఎక్కడ లేదు అని . దాన్ని అడిగే హక్కు నీకు లేదు అని పంపేసినట్టు. ఇక లైవ్ లో తన షో ని ఆపేసినట్టు చెప్పుకున్నాడు.