అయోతి తెలుగు రీమేక్ లో వెంకటేష్
తమిళ నాట మతం నేపధ్యం లో వచ్చి మంచి హిట్ కొట్టిన అయోతి సినిమా తెలుగు వెర్షన్ లో వెంకటేష్ కథానాయకుడిగా నటించనున్నారు. ప్రస్తుతం శైలేష్ కొలను ” సైన్ధవ్” షూటింగ్ లో వున్నా వెంకటేష్ , అది పూర్తి కాగానే అయోతి తెలుగు రీమేక్ లో నటించనున్నారు అని సమాచారం. మందిర మూతే దర్శకత్వం లో వచ్చిన ఈ లౌ బడ్జెట్ థ్రిల్లర్ హిందూ మతానికి , దాని పై ఉండే వ్యామోహం తో సాగే కధనం తో నడుస్తుంది.
అయితే ఇలాంటి సినిమా లు ఇప్పుడు తెలుగు ఆడుతాయ లెవా అనేది సందేహం. తమిళనాట హిందూ మాతం పై వ్యంగ్య ధోరణి లో సినిమా చేస్తే నడుస్తుంది కానీ తెలుగు నాట అలా కాదు.
ఈ సినిమా లో ఒక హిందూ కుటుంబం రామేశ్వరం ప్రయాణం లో జరిగే విషాద కధనం తో సాగుతుంది. గోపాల గోపాల లాంటి కధనం ఏదో పవన్ కళ్యాణ్ ఉండటం తో కొంత ఆడింది కానీ, ఇలాంటి కధలు ఇప్పుడు తెలుగు నాట ఆడటం కొంత కష్టమే.