గువ్వల బాలరాజు కి 100 కోట్లా ? డ్రామా చేసిన అతికినట్టు ఉండాలి అని నవ్విపోతున్న జనం
ఫార్మ్ హౌస్ కొనుగోలు వ్యవహారం నిజా నిజాలు ఎలా వున్నా, తెలంగాణ ప్రజలు మాత్రం నవ్వి పోతున్నారు. ఎందుకు పనికి రాని, ఇంకోసారి గెలిచే ఛాన్స్ లేని గువ్వల బాలరాజు కి వంద కోట్లా ! డ్రామా ఆడిన కొంచం అతికినట్టు నిజానికి దగ్గరగా ఉండాలి.
గువ్వల బాలరాజు లాంటి మల్లి గెలిచే ఛాన్స్ లేని ఎం ఎల్ ఏ లని వంద కోట్లు పెట్టి కొనే మూర్కత్వం ఏ పార్టీ కి ఉంటది ?
ఇక మిగితా ముగ్గురు ఎం ఎల్ ఏ లలో పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒక జంప్ జిలాని.
ఇంకా ఇతర ఇద్దరు రేగా కాంత రావు పేరు అయితే నెలకి ఒకసారి కూడా వార్తలలో ఉండదు, నియోజకవర్గం లో కాన రాడు. ఇతనికి డిపాజిట్ వస్తే ఎక్కువ అని “పినపాక” ప్రజలు నవ్వుకుంటున్నారు .
ఇంకా కొల్లాపూర్ హర్షవర్ధన్ రెడ్డి అయితే మీడియా వాళ్లకి కూడా పెద్దగా తెలియదు .
మాకు ఎందుకు పనికి రాని వాళ్ళు వంద కోట్ల కి అమ్ముడుపోయే విలువ ఉన్న వాళ్ళే అని నియోజక వర్గ ప్రజలు నవ్విపోతున్నారు.
నిజంగా బీజేపీ తలుచుకుంటే, అమిత్ షా లాంటి లీడర్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే పోయి కలవని నాయకుడు ఒక్కడైనా తెరాస లో ఉన్నాడా ?