కాంగ్రెస్ ను జాకీ లు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్న తీన్మార్ మల్లన్న ?

0
Teenmaar mallanna congress

Teenmaar mallanna congress

తీన్మార్ మల్లన్న , ఈ పేరు తెలియని వాళ్ళు ఇప్పుడు తెలంగాణ లో లేరు . సాధారణ జర్నలిస్ట్ గ మొదలుపెట్టి , V6 లో అంకెం రవి మార్గదర్శకం లో తీన్మార్ మల్లన్న గా బ్రాండ్ వేల్యూ సొంతం చేసుకున్న చింత పండు నవీన్ కుమార్ కెసిఆర్ వ్యతిరేక వాదం తో Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతలా ఎదిగాడు అంటే , అధికార పార్టీ , వాళ్ళ MLC కాండిడేట్ కలిసి కొన్ని కోట్లు ఖర్చుపెట్టి పెద్ద ఎత్తున వ్యూహం రచించిన కేవలం 10 వేల ఓట్ల తోనే తీన్మార్ మల్లన్న పై గెలవ గలిగారు.

అది తీన్మార్ మల్లన్న కెసిఆర్ వ్యతిరేక ఎజెండా తో యువత లో సొంతం చేసుకున్న బ్రాండ్. అయితే మొదటి నుంచి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ సానుభూతి పరుడు . ఎంత సేపు రాజకీయ నాయకుల అవినీతి , అక్రమాల గురించి మాట్లాడే తీన్మార్ మల్లన్న కనీసం ఒక్కసారైనా ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాం లో జరిగిన అవినీతి , అక్రమాల గురించి మాట్లాడలేదు .

అరెస్ట్ ఐన తర్వాత ప్రజలలో సానుభూతి కొరకు అప్పుడు మంచి ఊపు లో ఉన్న బీజేపీ లో చేరినట్టే చేరి కాషాయ కార్యకర్తల సపోర్ట్ ఆన్లైన్ లో పొంది , తర్వాత మెల్లగా ఆ పార్టీ కి ఆ కార్యకర్త లకి మాంచి మొండి చెయ్యి చూపించాడు.

కొన్ని రోజులు కాంగ్రెస్ జపం మరిచి నట్టే మరిచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ జపం మొదలెట్టాడు మన చింతపండు నవీన్ కుమార్ గారు.

తన షో రెగ్యులర్ గా అటు కేంద్రం లోని బీజేపీ పై చురకులు వేస్తూనే , కేటీర్ , కెసిఆర్ ల అవినీతి ఆరోపణలు కంటిన్యూ చేస్తున్నాడు సరే , ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీ ని రాష్ట్రం లో జాకీ పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు .

అది ఎలా గో చూద్దాం :

1 . Q న్యూస్ లో రోజు ఒక ప్రజా నాయకుడు ని అతిధి గా తీసుక వస్తూ ( BRS పార్టీ వాళ్ళు కాదు) , అందులో కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఒకలా , ఇంకో పార్టీ నాయకులైతే ఇంకో లా ప్రశ్నల వర్షం కురిపించి ఇరకాటం లో పెట్టి వెకిలి వేషాలు వేస్తాడు.

2 . కాంగ్రెస్ పక్క రాష్ట్రాలలో పాలన అద్భుతం అన్న రీతిలో, గత కాంగ్రెస్ పాలన రామ రాజ్యం రైతు రాజ్యం అన్న రీతిలో అర్ధం వచ్చేలా ప్రవర్తిస్తాడు.
ఉదాహరణ కు , ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ రుణ మాఫీ చేసింది అని, అక్కడ రైతుకు msp చాలా ఉంది అని ఏదో హడావిడి చేసి అది నిజం అని నమ్మించేలా ఛత్తీస్గఢ్ కి బస్సు యాత్ర కూడా నిధులు సమకూర్చి కొంత మంది రైతుల్ని తీసుకెళ్లాడు .

మరి ఇటు పక్క రాష్ట్రం కర్ణాటక ఛత్తీస్గఢ్ కన్నా చాలా దగ్గర హైదరాబాద్ కి . అక్కడ ఉచిత విద్యుత్ అని అధికారం లో వచ్చిన కాంగ్రెస్ , కేవలం మూడు రోజుల్లో నే విద్యుత్ చార్జీలను పెంచేసింది…

అక్కడ మధ్య తరగతి కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్నారు , కానీ ఎం చెయ్య గలరు, ఇంకా ఐదు యేండ్లు భరించాల్సిందే .

మరి అక్కడ విషయాలు గురించి ఎన్నడూ మాట్లాడాడు తీన్ మార్ మల్లన్న.

కెసిఆర్ తాగుబోతు సరే! మరి DK శివ కుమార్ ఏంటి చింతపండు ?

ప్రతి మార్నింగ్ న్యూస్ లో తీన్ మార్ మల్లన్న కెసిఆర్ తాగుబోతు అని అర్ధం వచ్చేలా మాట్లాడం మానడు. అవాకాశం వస్తే కెసిఆర్ తాగుబోతు అనే సంకేతం పంపించే ప్రయత్నం చేస్తాడు . కానీ కాంగ్రెస్ ప్రచార రధ సారధి డీకే శివ కుమార్ తాగి తూలుతూ ప్రచారం చేస్తే ఈయనకు కనిపించదు .

ఇంతే కాదు , కాంగ్రెస్ వాళ్ళ దుశ్చ్యర్యలు , దురాగతాలు ఈయన గారికి ఎక్కడ కనపడవు. కాంగ్రెస్ అనేది ఒక్క గొప్ప పార్టీ, అసలు అవినీతే లేదు అన్నట్టు సాగుతుంది ఆయన న్యూస్ ప్రోగ్రాం.

రేవంత్ రెడ్డి సంచులు మోసిన సంగతి, భూ కాభజాల ఆరోపణల విషయం లో చెవిలో చింత పండు పెట్టుకున్నాడా అన్నట్టు ఉంటుంది మన చింతపండు వ్యవహారం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *