బీజేపీ లీడర్స్ తో కలిస్తే సినీ స్టార్ కి కూడా కష్టాలు తప్పవా ?

0
NTR brahmastra

స్టార్ హీరో ఎన్టీఆర్ గత వారం అమిత్ షా హైదరాబాద్ పర్యటన లో ఆయన తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ కలయిక ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం కాదు, అమిత్ షా పిలిస్తే వెళ్లి కలిశారు. దేశానికి హోమ్ మంత్రి , అందులో కేంద్ర అధికార పార్టీ లో కీలక వ్యక్తి , చాణక్యుడిగా పేరు ఉన్న అమిత్ షా పిలిస్తే వెళ్లని వాళ్ళు ఎవరు . ఎన్టీఆర్ అలాగే వెళ్ళాడు , ఇప్పుడు అదే కారణం వల్ల బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదు అనే చర్చ జోరుగా సాగుతోంది.

రామోజీ ఫిలిం సిటీ లో ఆదివారం జరగాల్సిన బ్రహ్మాస్త్ర సినిమా ఈవెంట్ కి పోలీస్ శాఖ పర్మిషన్ ఇవ్వలేదు . వినాయక నిమజ్జనోత్సవం లో తలమునకలై ఉండడం తో మేము రామోజీ ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేం అని చేతులెత్తేసింది .

దీని వల్ల , బ్రహ్మాస్త్ర సినిమా యూనిట్ తమ ఈవెంట్ ని కాన్సుల్ చేసుకుంది .

కేవలం ఎన్టీఆర్ అమిత్ షా తో కలవడం వల్లే ఈ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు అనే చర్చ ఇప్పుడు హైదరాబాద్ లో జోరుగా సాగుతోంది.

తమకి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ తో అనుకూలంగా ప్రవర్తిస్తే వాళ్లకి ఇక మా సపోర్ట్ ఉండక పోగా , పూర్తి అడ్డంకులు ఉంటాయి అనే సంకేతాన్ని పంపాలి అన్న ఉద్దేశ్యం తోనే తెరాస పార్టీ ఇలా పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు అనే గుస గుస లు వినిపిస్తున్నాయి .

వినాయక నిమజ్జనం ఉత్సవాళ్ళని సాకుగా చూపి !!…

వినయ చవితి జరిగి మూడో రోజు మాత్రమే , కేవలం ఇరవై శాతం వినాయక మండపాలు మాత్రమే నిమజ్జనానికి సిద్ధం అవుతాయి . అంత మాత్రానికి ఒక చిన్న సినిమా ఈవెంట్, అందులోనూ రామోజీ ఫిలిం సిటీ లాంటి పకడ్బందీ సెక్యూరిటీ ఉండే ఫిలిం సిటీ లో ఇవ్వకపోడం విడ్డూరం గా ఉంది .

బ్రహ్మాస్త్ర ఈవెంట్ ఏమి పెద్ద నిమజ్జనం రోజు పెట్టుకోలేదు. కేవలం మూడో రోజు అందులో ను సిటీ అవతల రామోజీ ఫిలిం సిటీ లో .

అంటే ఇక వినాయక చవితి తర్వాత పది పదిహేను రోజులు హైదరాబాద్ నగరం లో ఎటువంటి ఈవెంట్లు జరగవా ??
పోలీస్ లు నిమజ్జనం పూర్తి అయ్యే వరకు ఎటువంటి సభ లు, ఈవెంట్ లకి భద్రత కలిపించలేరా ?

హైదరాబాద్ పోలీస్ అంత బలహీనమా ?

మునవారు ఫారూఖ్ షో కి వెయ్యి మంది పోలీసులని పంపారు , ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్లే షో కి వంద మంది పోలీసులని పంపలేరా ?
మొన్నటికి మొన్న హిందూ దేవి దేవతలని అవమానించి న మాత మౌడ్య కమెడియన్ మునవారు ఫారూఖ్ కామెడీ షో కి వెయ్యి మంది పోలీసులు కావాల్సి వచ్చింది. పిలిచి మరి , ఒక చిన్న కమెడియన్ ( అసలు కేవలం సీత రాముడిని దూషించడం వల్లే పేరు వచ్చింది ) ని పిలిచి మరి భద్రత కలిపించినప్పుడు , ఒక పెద్ద బాలీవుడ్ ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వకపోవడం రాజకీయ కుట్ర తప్ప వేరొకటి కాదు అని స్పష్ఠంగా తెలుస్తోంది .

Opinion :

తెరాస పార్టీ గ్రాఫ్ ఈ మధ్య విపరీతంగా పడిపోయింది , ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ లాంటి సినిమా స్టార్స్ తో పెట్టుకుంటే వారి అభిమానుల ఓట్ల విషయం లో తేడా తప్పకుండా వస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ ఓట్లే తెరాస కి కలిసి వచ్చాయి. అసలు తెలంగాణ వాళ్ళు మరియు ఉత్తరాది వాళ్ళు ఉన్న ప్రాంతాలలో బీజేపీ పాగా వేసింది.
ఆంధ్ర వాళ్ళు సినిమా స్టార్ లని సొంత కుటుంబ సభ్యుడిగా చూస్తారు . అందులోనే ఎన్టీఆర్ , బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ల అభిమానులు చాలా కఠినంగా ఉంటారు.
ఇలాంటి కక్ష సాధింపు చర్యల వల్ల ఎంత కొంత వోట్ బ్యాంకు తగ్గే అవకాశం ఉండడం తప్ప ఆల్రెడీ చాలా ఎత్తులో నిలదొక్కుకున్న స్టార్ హీరో లని తెరాస లాంటి పార్టీ ఏమి చెయ్యలేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *